Saturday, January 17, 2009

Veerappa Moily Reacts on Chiru Stand of Telangana


న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయాలకు కొత్త అని, తెలంగాణపై చేసిన ప్రకటన పరిణామాలు చిరంజీవికి ముందు ముందు తెలిసి వస్తాయని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. తెలంగాణకు చిరంజీవి మద్దతిస్తూ చేసిన ప్రకటనపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. చిరంజీవికి తెలంగాణ సమస్య లోతుగా అర్థమయ్యే అవకాశం లేదని, దాని తీవ్రత కూడా చిరంజీవికి అర్థం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినవేనని ఆయన విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణకు ఛాంపియన్ గా నిలిచేది, తెలంగాణ అంశాన్ని తేల్చేది కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తదుపరి పరిణామాలను తమకు వదిలేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రకటనలు చేయడం కాదు, అసలైన సమయంలో తెలంగాణ కోసం నిలబడాలని ఆయన అన్నారు. వామపక్షాలతో అన్ని పార్టీలు తెలంగాణకు ద్రోహం చేశాయని, తాము తెలంగాణ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, వామపక్షాలు మధ్యంతరంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తమ విధానాన్ని మార్చుకోలేమని, తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ కోర్ కమిటీ చర్చించిందని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment

Blog Archive